ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్)కు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 150 ఫెలోషిప్‌లను అందిస్తున్నది. ఇందులో 120 ఫెలోషిప్‌లు బయోమెడికల్ సైన్సెస్‌లో, 30 ఫెలోషిప్‌లు సోషల్ సైన్సెస్‌కు సంబంధించినవి ఉన్నాయి. వీటికి సంబంధించిన దరఖాస్తులు ఏప్రిల్ 27న ప్రారంభమవుతాయి. మే 27తో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. అధికారిక వెబ్‌సైట్ అయిన icmr.nic.in., pgimer.edu.in ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో జూలై 17న నిర్వహిస్తారు. ఈ పరీక్షను చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్) నిర్వహిస్తున్నది.