ప్రపంచ క్రికెట్‌లో పెద్దన్న పాత్ర పోషించే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరోసారి తన మాట చెల్లుబాటయ్యేలా చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన ఆసియాకప్‌లో పాల్గొనేది లేదని భారత్ పట్టుబట్టడంతో.. తప్పని పరిస్థితుల్లో టోర్నమెంట్‌ను తటస్థ వేదిక (దుబాయ్)కు మార్చారు. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం వివరాలు తెలిపాడు.