గ్రామాలకు సంచార ల్యాబ్‌లు

వైద్యరంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారనుందని, వ్యాధులు వచ్చాక చికిత్స చేయడంకంటే వ్యాధులే రాకుండా అడ్డుకట్టవేసే దిశగా నివారణ చర్యలను ముమ్మరం చేసిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన ‘వరల్డ్‌ రేర్‌ డిసీజెస్‌ డే’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను,135 వ్యాధినిర్ధారణ కేంద్రాలను ఏర్పాటుచేశామని, వ్యాధులను ఆరంభ దశలోనే గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.